
దసరాకు సర్వం సిద్ధం
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
● నర్సంపేట అంగడి మైదానంలో
రావణవధ
నర్సంపేట: జిల్లా వ్యాప్తంగా గురువారం దసరా వే డుకలను ఘనంగా నిర్వహించుకోనున్నారు. పలు ఆలయాల్లో షమీ పూజ, జమ్మి ఆకు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో రావణవధకు ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నర్సంపేట పట్టణంలోని అంగడి మైదానంలో జరగనున్న దసరా వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని ఉర్సు రంగలీల మైదానంలో ఓరుగల్లు ఖ్యాతి చాటేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.