
గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్
ఐనవోలు: మండలంలోని ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నమని శివకుమార్‌కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆగస్టు 29న డాక్టరేట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. మంగళవారం హైదరాబాద్‌లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆడిటోరియంలొ నిర్వహించిన 26వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చాన్స్‌లర్ అండ్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ డాక్టరేట్‌ను శివకుమార్‌కు ప్రదానం చేశారు. తొమ్మిదో తరగతి విద్యార్థుల జీవశాస్త్ర సాధనపై జీవిత నైపుణ్యాలు, అధ్యయన అలవాట్ల ప్రభావంపై శివకుమార్ సమర్పించిన థీసిస్‌కు డాక్టరేట్ లభించింది. శివకుమార్ ఎమ్మెస్సీ బోటని, ఎమ్మెస్సీ సైకాలజీ, ఎంఈడీ, పీజీ డిప్లమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, నెట్ ఇన్ ఎడ్యుకేషన్‌తో పాటు ప్రస్తుతం పీహెచ్‌డీ పూర్తి చేశారు. శివకుమార్‌కు ఒంటిమామిడిపల్లి గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.