
కనువిందు చేసిన సూరీడు
దుగ్గొండి: భగ భగ మండే సూర్యుడి చుట్టూ ఓ అందమైన రూపం మంగళవారం మధ్యాహ్నం కనువిందు చేసింది. వారం రోజులుగా ముసురువానతో ఉన్న వాతావరణం మంగళవారం ఎండ వేడిమితో ఉక్కపోసింది. ఇదే తరుణంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యుడు భగ భగ మండుతుండగా సూర్యుడి చుట్టూ ఇంద్రదనస్సు లాంటి రంగులతో కూడిన వృత్తాకార వలయం కనువిందు చేసింది. ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి ఫొటోలు తీసుకుని ఆసక్తిగా తిలకించారు.
ఆవిర్భావ సభను
విజయవంతం చేయాలి
నర్సంపేట: జిల్లా కేంద్రంలో అక్టోబర్ 5వ తేదీన జరిగే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్‌ఎం/డీఎఫ్‌సీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ జిల్లా ఆవిర్భావ సదస్సును విజయవంతం చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ స్టేట్ కో ఆర్డినేటర్ ముంజాల రాజేందర్‌గౌడ్ కోరారు. ఈ మేరకు పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో మంగళవారం సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతులు, మేధావులు, కుల సంఘాలు, నాయకులు, వివిధ సామాజిక నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ రామగిరి యాదగిరిస్వామి, జిల్లా నాయకులు సంగాల శివకృష్ణ, ముంజాల సంజీవకుండే, ప్రభాకర్ నల్లబెల్లి, కత్తి ఆనంద్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్, పూలే స్ఫూర్తితో ముందుకు సాగాలి
నర్సంపేట: గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా మహనీయులు నడియాడిన ప్రాంతాలను సందర్శిస్తూ అక్షరాల వ్యాప్తికి, గ్రంథాలయాల అభివృద్ధికి ముందుకు సాగుతున్నట్లు లీడ్ గ్రంథాలయం వ్యవస్థాపకుడు, ప్రముఖ గ్రంథాలయ ఉద్యమకర్త, కవి కాసుల రవికుమార్‌శోభారాణి దంపతులు తెలిపారు. ఈ మేరకు ముంబాయిలోని బాబాసాహెబ్ అంబేడ్కర్ స్మారక స్థూపం చైత్యభూమి, బాబాసాహెబ్ నివాస స్థలం రాజగృహ, పూణేలోని మహాత్మా జ్యోతి బాపూలే, సావిత్రిబాయిపూలే స్మారక స్థలాలను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. పేద విద్యార్థుల చదువులకు, గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తికి ప్రయత్నిస్తామని తెలిపారు.
యూరియా కోసం
ఆందోళన
పర్వతగిరి: మండలంలోని చౌటపల్లి గ్రామానికి యూరియా బస్తాలు కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయంటూ మంగళవారం రై తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీ ఎదుట ధ ర్నా చేపట్టారు. గ్రామంలో సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలను చౌటపల్లి రైతులకు ఇవ్వకుండా సొసైటీ పరిధిలోని ఇతర గ్రామాల రైతులకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సొ సైటీ కార్యాలయం చౌటపల్లి గ్రామంలో ఉన్న రైతులకు యూరియా బస్తాలు అందడం లేదని మండిపడ్డారు. వెంటనే గ్రామానికి సరిపడా బస్తాలను అందించాలని డిమాండ్ చేశారు.
రంగు పడింది..
● ‘స్థానిక’ కోడ్ అమలులో అధికారులు
సంగెం: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కూయడంతో అధికారులు అప్రమత్తం అ య్యారు. ఎన్నిక ల కోడ్ అమలు చేస్తున్నారు. గ్రామాల్లోని పలు పార్టీల జెండా గద్దెలకు రంగు వేయించడంతోపాటు ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు తొలగిస్తున్నా రు. జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని పంచా యతీ కార్యదర్శులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోడ్ అమలు చేస్తున్నారు.

కనువిందు చేసిన సూరీడు

కనువిందు చేసిన సూరీడు

కనువిందు చేసిన సూరీడు

కనువిందు చేసిన సూరీడు