స్థానిక సమరానికి సై..! | - | Sakshi
Sakshi News home page

స్థానిక సమరానికి సై..!

Sep 30 2025 7:18 AM | Updated on Sep 30 2025 7:18 AM

స్థానిక సమరానికి సై..!

స్థానిక సమరానికి సై..!

– 9లోu

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో మొత్తం వివరాలు
జెడ్పీలు 06జెడ్పీటీసీలు 75 ఎంపీపీలు 75 ఎంపీటీసీలు 778 సర్పంచ్‌లు 1,708

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

ప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు సోమవారం నగారా మోగింది. పొలిటికల్‌ కొలువులు ఎన్నికల ద్వారా భర్తీకి సమయం ఆసన్నమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రెండు విడతలు.. సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కానుండగా.. నవంబర్‌ 11న ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. మొత్తం ఐదు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు.

వచ్చే నెల 9, 17 తేదీల్లో నోటిఫికేషన్‌..

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. అక్టోబర్‌ 9 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఐదు దశల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, సర్పంచ్‌ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తారు. అక్టోబర్‌ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడుత పోలింగ్‌, అదే నెల 27న రెండో విడత పోలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్‌ 17న సర్పంచ్‌ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. అక్టోబర్‌ 31న సర్పంచ్‌ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ఉంటుంది. అక్టోబర్‌ 21 నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ, నవంబర్‌ 4న రెండో విడత పోలింగ్‌, మూడో విడత ఎన్నికలకు అక్టోబర్‌ 25 నుంచి నామినేషన్లు స్వీకరించి, నవంబర్‌ 8న పోలింగ్‌ నిర్వహిస్తారు. సర్పంచ్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడిస్తారు. ఉమ్మడి వరంగల్‌లోని 6 జిల్లాల్లో 6 జిల్లా పరిషత్‌లు, 75 జెడ్పీటీసీలు, 75 ఎంపీపీలు, 778 ఎంపీటీసీలు, 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయి. ఇందుకోసం 15,258 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

45 రోజులపాటు ఎన్నికల కోడ్‌

షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించా రు. మండల, జిల్లాల సరిహద్దుల్లో 25 చెక్‌పోస్టుల ఏర్పాటుకు పోలీసు కమిషనర్‌, ఎస్పీలు స్థల పరిశీలన చేశారు. సుమారు 45 రోజులు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండనుండగా, అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలకు బ్రేక్‌ పడనుంది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా పోలీసు నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు.

గెలుపు గుర్రాల వేటలో పార్టీలు..

షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అధికార పార్టీ కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా.. బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా చాలెంజ్‌గా తీసుకుంటున్నాయి. వామపక్షాలు, ఇతర పార్టీలు సైతం ‘స్థానిక’ంలో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ స్థానాలు, ఆరు జిల్లా పరిషత్‌లను గెలుచుకునేందుకు ఆ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలపై అధిష్టానం ఈ బాధ్యతలు మోపనుండగా.. బీఆర్‌ఎస్‌, బీజేపీ సైతం త్వరలోనే ఇన్‌చార్జ్‌లను నియమించనున్నాయి.

ఎట్టకేలకు మోగిన ‘లోకల్‌’ ఎన్నికల నగారా

ఎంపీటీసీ, జెడ్పీటీటీలకు రెండు విడతలు

మూడు విడతల్లో సర్పంచ్‌,

వార్డు సభ్యుల ఎన్నికలు

ఉమ్మడి వరంగల్‌లో అమల్లోకి ఎన్నికల కోడ్‌

మండల, జిల్లా సరిహద్దుల్లో

చెక్‌ పోస్టుల ఏర్పాటు.

గెలుపు గుర్రాల వేటలో ప్రధాన రాజకీయ పార్టీలు

జిల్లాల వారీగా జెడ్పీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, వార్డుల వివరాలు

జిల్లా జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్‌ వార్డులు

హనుమకొండ 1 12 12 129 210 1,986

వరంగల్‌ 1 11 11 130 317 2,754

భూపాలపల్లి 1 12 12 109 248 2,102

మహబూబాబాద్‌ 1 18 18 193 482 4,110

ములుగు 1 10 10 83 171 1,520

జనగామ 1 12 12 134 280 2,534

స్థానిక రిజర్వేషన్లు ఖరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement