
సద్దుల సంబురం
జిల్లాలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు
జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం రాత్రి అంబరాన్నంటాయి. మహాలయ అమావాస్య రోజు ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులపాటు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో వాడవాడలా పూల జాతర కనులపండువగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలు, రంగులతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం కూడళ్లు, ఆలయాలు, చెరువు గట్ల వద్దకు బతుకమ్మలతో తరలివెళ్లి ఆడిపాడారు. వాయినాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేసి గౌరమ్మను సాగనంపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. – సాక్షి, నెట్‌వర్క్

సద్దుల సంబురం