
పాడితోనే మహిళల ఆర్థికాభివృద్ధి
సంగెం/గీసుకొండ: పాడిపశువుల పెంపకంతోనే మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని నేషనల్ రూరల్ లైవ్‌లీ హుడ్ మిషన్ ఢిల్లీ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) రిసోర్స్ పర్సన్లు డాక్టర్ జయవర్ధన్, డాక్టర్ సిజియో అన్నారు. ఈ మేరకు సంగెం మండలంలోని గుంటూరుపల్లి, వెంకటాపూర్, గీసుకొండ మండలంలోని ఊకల్‌హవేలి, మరియపురం గ్రామాల్లో శుక్రవారం వారు పర్యటించారు. పాలసేకరణ, విక్రయాలు, లాభాలు ఎలా ఉన్నాయని మహిళా పాల ఉత్పత్తిదారుల సొసైటీలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో పరకాల ఇందిరా క్రాంతి మహిళా డెయిరీ ద్వారా అందించనున్న గేదెలు, సేకరించే పాలు తదితరాల అంశాలపై అధ్యయనం కోసం పర్యటించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సెర్ప్ నుంచి డాక్టర్ సతీశ్, ఖమ్మం వెటర్నరీ ఏపీఓ డాక్టర్ నరసింహా, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వరలక్ష్మి, ఏపీఎంలు రాజ్‌కుమార్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.