
కారు డ్రైవర్ అదృశ్యం
సంగెం: కారు డ్రైవర్ అదృశ్యమైన ఘటన మొండ్రాయిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మొండ్రాయి గ్రామానికి చెందిన పరికి విజయ్(30) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విజయ్‌కి భార్య, ఓ కూతురు ఉన్నారు. దంపతులకు తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింటికి వెళ్లి రావడం లేదు. వరంగల్ నగరంలో కారు డ్రైవింగ్ చేసుకుంటున్న విజయ్ అప్పుడప్పుడు ఇంటికి వస్తుపోతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి కారు డ్రైవింగ్ కోసం వెళ్లాడు. తర్వాత రెండు రోజులకు కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ఆచూకీ లభించలేదు. విజయ్ నల్లని జీన్స్ పాయింట్, ఆకుపచ్చ టీషర్ట్ ధరించాడు. 5.4 ఎత్తు నల్లని రంగు కలిగి ఉంటాడు. విజయ్ ఆచూకీ తెలిసినవారు 8712685243, 8712685029 నంబర్లలో సంప్రదించాలని ఎస్సై నరేశ్ కోరారు.