ఎన్నికల నిబంధనలు పాటించాలి : డీపీఓ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలు పాటించాలి : డీపీఓ

Sep 27 2025 4:26 AM | Updated on Sep 27 2025 4:26 AM

ఎన్నికల నిబంధనలు పాటించాలి : డీపీఓ

ఎన్నికల నిబంధనలు పాటించాలి : డీపీఓ

యూత్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లుగా కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

సంగెం: ఎన్నికల్లో పీఓలు జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని జిల్లా పంచాయతీ అధికారి కల్ప న ఆదేశించారు. సంగెం రైతువేదికలో రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శుక్రవారం ప్రిసైడింగ్‌ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటిస్తూ విధులు నిర్వర్తించాలన్నారు. అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్లు పకడ్బందీగా విధులు నిర్వర్తించేలా చూడాలని సూచించారు. ఎంపీడీఓ రవీందర్‌, ఏంఈఓ రాము, పీఓలు పాల్గొన్నారు.

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు పరీక్షలు

న్యూశాయంపేట: వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌యార్డు ప్రాంతంలో 184 మంది లైసెన్స్‌ డ్‌ సర్వేయర్లకు శుక్రవారం నిర్వహించిన పరీక్షలను జిల్లా అదనపు కలెక్టర్‌ జి.సంధ్యారాణి పరిశీలించారు. ఈనెల 27, 29 తేదీల్లో జరిగే ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ల్యాండ్‌ సర్వే సంచాలకులు శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులు, అధ్యాపకులకు ముఖ గుర్తింపు హాజరు

గీసుకొండ: ఇంటర్‌ విద్యార్థులు, అధ్యాపకులకు ముఖ గుర్తింపు (ఫేస్‌ రికగ్నిషన్‌) హాజరు పద్ధతి ప్రారంభించామని ఇంటర్‌ బోర్డు జిల్లా నోడల్‌ అధికారి శ్రీధర్‌ సుమన్‌ అన్నారు. శుక్రవారం గీసుకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం పెరిగి అధికంగా ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆన్‌లైన్‌ తరగతులు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్‌ కె.శోభాదేవి మాట్లాడుతూ తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశాలు విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతాయని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ కళాశాల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

‘డ్రంకెన్‌ డ్రైవ్‌’లో ఒకరికి జైలు

దుగ్గొండి: డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలు శిక్షపడింది. ఎస్సై రణధీర్‌రెడ్డి కథనం ప్రకారం.. బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన గాదం రాజు ఈ నెల 24న సాయంత్రం మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. దీంతో ఎస్సై రణధీర్‌రెడ్డి కేసు నమోదు చేసి నర్సంపేట అదనపు మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచారు. రాజు కు మూడు రోజుల జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ మేరకు ఆయనను మహబూబా బాద్‌ సబ్‌ జైలుకు తరలించారు.

కేయూ క్యాంపస్‌: కేయూలోని యూత్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లుగా కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నిరంజన్‌ శ్రీనివాస్‌, బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాధికను నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాదిపాటు వీరు పదవిలో ఉంటారు. వర్సిటీలోని స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో ఈ ఇద్దరు బాధ్యతలు నిర్వర్తిస్తారు. బాయ్స్‌కు ఒకరు, గర్ల్స్‌కు మరొకరు యూత్‌ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement