
చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నెక్కొండ: భూస్వాములు, రజాకార్లను తరిమికొట్టి, దేశ్‌ముఖ్‌లకు ముచ్చెమటలు పట్టించిన ధీశాలి చాకలి (చిట్యాల) ఐలమ్మ అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో హైస్కూల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే దొంతి ఆవిష్కరించి మాట్లాడారు. వీరనారి చాకలి ఐలమ్మ అని ఆయన కొనియాడారు. తను పండించిన ధాన్యం విషయమై ప్రారంభమైన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి ఆమె ఊపిరి పోసిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఐలమ్మ కుటుంబానికి ఆంధ్రమహాసభ అండగా నిలిచిందని చెప్పారు. రజకులు ఐలమ్మ స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. నెక్కొండ చెరువు కట్టపై రజకుల కుల దైవం మడేలయ్య ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, నెక్కొండ, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు రావుల హరీశ్‌రెడ్డి, పాలాయి శ్రీనివాస్, విగ్రహ దాత విద్యుత్ రిటైర్డ్ ఏఈ చల్లా రఘోత్తంరెడ్డి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, గ్రామ కార్యదర్శి సదానందం, కాంగ్రెస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బక్కి అశోక్, కుసుమ చెన్నకేశవులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఆవుల శ్రీనివాస్, మాదాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గరికపాటి హన్మంతరావు పాల్గొన్నారు.