
కలెక్టరేట్‌లో వైన్స్ దరఖాస్తుల స్వీకరణ
కాజీపేట అర్బన్: హనుమకొండ కలెక్టరేట్‌లోని సెల్లార్‌లో వైన్స్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టరేట్‌లోని ఎకై ్సజ్ సూపరిండెంట్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కాజీపేట, హనుమకొండ, వరంగల్ అర్బన్, ఖిలావరంగల్ స్టేషన్ల పరిధిలో గతంలో 65 వైన్స్ ఉండగా.. వరంగల్ రూరల్ నుంచి వర్ధన్నపేట, పరకాల నుంచి రెండు వైన్స్ అదనంగా రావడంతో ప్రస్తుతం 67 వైన్స్‌కుగాను 2025–27 రెండేళ్ల కాలపరిమితికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు దరఖాస్తు రుసుము రూ.3 లక్షలు డీపీఈఓ పేరిట డీడీ లేదా చలాన్‌ను నేషనల్ బ్యాంక్ ద్వారా తీసుకుని దరఖాస్తుతో సమర్పించాలని సూచించారు. అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కాజీపేట, హనుమకొండ, వరంగల్ అర్బన్ ఎకై ్సజ్ స్టేషన్ల సీఐలు చంద్రమోహన్, దుర్గాభవాని, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్