ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ | - | Sakshi
Sakshi News home page

ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ

Sep 25 2025 6:57 AM | Updated on Sep 25 2025 3:05 PM

రామన్నపేట: వరంగల్‌ ఏసీపీ కార్యాలయాన్ని బుధవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీకి ఏఎస్పీ శుభం పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలుకగా సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ కార్యాలయ పరిసరాలు, రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా డివిజన్‌ పరిధిలో కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్ట్‌, ఎస్టీ, ఎస్సీ కేసుల స్థితిగతుల గురించి ఏఎస్పీని అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై సీపీ ఆరా తీశారు. తనిఖీల్లో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌సలీమా, ఏసీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

27న కోర్టులో పార్కింగ్‌ స్టాండ్‌కు వేలం

వరంగల్‌ లీగల్‌: జిల్లా కోర్టు ప్రాంగణంలో సైకిల్‌, స్కూటర్‌, కారు పార్కింగ్‌ స్టాండ్‌ నిర్వహణకు ఈనెల 27న (శనివారం) సాయంత్రం 4 గంటలకు హనుమకొండ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు ప్రాంగణంలో వేలం వేయనున్నట్లు హనుమకొండ జిల్లా చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ అజీం తెలిపారు. వేలంలో పాల్గొనేవారు 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు రూ.1,000 మొత్తాన్ని సూపరింటెండెంట్‌ (అకౌంట్స్‌), ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు, హనుమకొండ వద్ద డిపాజిట్‌ చేసి అర్హత పొంది ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు హనుమకొండ డిస్ట్రిక్ట్‌ కోర్టు వెబ్‌సైట్‌ పరిశీలించాలని సూచించారు.

సీసీ కెమెరాల నిర్వహణకు

దరఖాస్తుల స్వీకరణ

జిల్లా కోర్టు ప్రాంగణంలోని 164 కెమెరాలతో కూడిన సీసీ టీవీ వ్యవస్థను నవంబర్‌ 2025 నుంచి అక్టోబర్‌ 2026 వరకు నిర్వహించేందు కు కొటేషన్లు అక్టోబర్‌ 7వ తేదీ వరకు హనుమకొండ జిల్లా జడ్జికి సమర్పించాలని హనుమకొండ జిల్లా చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ అజీం సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా కోర్టు వెబ్‌సైట్‌ పరిశీలించాలని పేర్కొన్నారు.

ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ.ప్రవీణ్‌ను వీఆర్‌కు బదిలీ చేయగా.. ప్రస్తుతం సీసీఆర్‌బీలో విధులు నిర్వహిస్తున్న కె.శ్రీధర్‌రావును ధర్మసాగర్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

విద్యారణ్యపురి: ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చేలా కృషి చేయాలని టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మన్నె చంద్రయ్య కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన కేంద్రమంత్రి బండి సంజయ్‌ని కలిసి వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ఉపాధ్యాయులు టెట్‌ ఉత్తీర్ణత సాధించాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని, ఎస్జీటీలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో టీపీఆర్టీయూ రాష్ట్ర సహాధ్యక్షుడు రావులకార్‌ వెంకటేశ్‌, హనుమకొండ జిల్లా బాధ్యులు పూదరి రమేశ్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

సీనియర్‌ సిటిజన్లకు ప్రాధాన్యం

డీఆర్‌ఓ వైవీ గణేశ్‌

హన్మకొండ అర్బన్‌: సీనియర్‌ సిటిజన్లకు ప్రాధాన్యం ఇవ్వడం, వారిని రక్షించడం మన కర్తవ్యమని హనుమకొండ రెవెన్యూ అధికారి వైవీ గణేశ్‌ అన్నారు. బుధవారం ఆయన అధ్యక్షతన కలెక్టరేట్‌లో సీనియర్‌ సిటిజన్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ.. త్రైమాసిక సమావేశాల్ని తప్పనిసరిగా నిర్వహించాలని, వాటిని గ్రామ, మండల స్థాయిలో చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ నారాయణ, డీడబ్ల్యూఓ జయంతి, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, వివిధ శాఖల అధికారులు, సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ బాధ్యులు పాల్గొన్నారు.

ఏసీపీ కార్యాలయాన్ని  తనిఖీ చేసిన సీపీ1
1/1

ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement