
గాయత్రిని కొలిస్తే బ్రహ్మజ్ఞానం
దేవాలయంలో అమ్మవారికి బిల్వార్చన చేస్తున్న భక్తులు
హన్మకొండ కల్చరల్: గాయత్రీదేవిని కొలిచినవారికి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని పురాణాల్లో పేర్కొన్నారని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. వేయిస్తంభాల ఆలయంలో శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి అర్చకులు ప్రభాతసేవ, స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి బిల్వార్చన నిర్వహించి అల్లంగారెలు నైవేద్యంగా నివేదన చేశారు. యాగశాలలో చండీహోమం నిర్వహించారు. వందలాది మంది భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం సూత్రపు అభిషేక్ భక్తిపాటలు భక్తులను అలరించాయి. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.