
ఎస్‌హెచ్‌జీలకు యూనిఫాం
పొదుపు సంఘాల సభ్యులకు రెండు చీరలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు త్వరలో యూనిఫాం పేరుతో ప్రభుత్వం చీరలు అందజేయనుంది. ఇందుకు సంబంధించి జిల్లాలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. చీరలు క్షేత్రస్థాయికి చేరుకోవడమే తరువాయి.. పంపిణీ కార్యక్రమం ప్రారంభించేందుకు జిల్లాస్థాయి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో పంపిణీ చేసిన సమయంలో కొంత వరకు అభాసుపాలైంది. చీరలు నాణ్యత లేకపోవడం, ఇష్టం ఉన్నా లేకున్నా అందరికీ ఇవ్వడం వంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవహారంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈసారి నాణ్యమైన చీరలు అందించనుంది. గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన దసరా చీరల ధర సుమారు రూ.260 వరకు ఉండేది. నాణ్యత లోపించిందని విమర్శలు వచ్చాయి. కానీ, ప్రస్తుతం 8 రకాల పోచంపల్లి కోట చీరలను ఒక్కోటి రూ.800 ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. సంవత్సరానికి రెండు చీరలు మహిళా సంఘాల సభ్యులకు యూనిఫాం పేరుతో అందజేయాలని నిర్ణయించింది.
గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటు..
గతంలో మాదిరిగా రేషన్ డీలర్లు, రెవెన్యూ సిబ్బంది పాత్ర లేకుండా ఈసారి పూర్తిగా మహిళా సంఘాల ద్వారానే చీరలు (యూనిఫాం) పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రామస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి నుంచి చీరలు గ్రామస్థాయికి చేరగానే పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘాల ప్రతినిధులు (అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి) ఆధ్వర్యంలో సభ్యులకు పంపిణీ చేపట్టనున్నారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
సంవత్సరంలో రెండుసార్లు..
గతంలో బతుకమ్మ కానుకగా మహిళలకు చీరలు అందజేశారు. ప్రస్తుతం యూనిఫాం పేరుతో ఇస్తు న్న ఈ చీరలు సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వనున్నారు. అక్టోబర్ చివరి నాటికి ఈ పంపిణీ కార్యక్ర మం పూర్తిచేసేలా ఏర్పాట్లు చేశారు. మరో చీర ఏ ప్రిల్ నాటికి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
జిల్లాకు 8 రకాల
పోచంపల్లి కోట శారీస్ రాక
వచ్చే నెలాఖరు నాటికి
పంపిణీ చేసేందుకు అధికారుల కసరత్తు
ఎస్‌హెచ్‌జీలు, పంచాయతీ
కార్యదర్శులకు బాధ్యతల అప్పగింత