
వరాల తల్లి వచ్చేసింది..
దేవీశరన్నవరాత్రులు షురూ..
గ్రేటర్ వరంగల్ నగరంలో సోమవారం దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరీ దేవిని, భద్రకాళి ఆలయంలో భద్రకాళి అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. హనుమకొండలో పద్మాక్షి అమ్మవారికి శైలపుత్రి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమకొండ రెడ్డి కాలనీలో 51 అడుగుల దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయా ఆలయాల్లో ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, శేషు, నాగిళ్ల శంకర్‌శర్మ, ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
– హన్మకొండ కల్చరల్/హన్మకొండ అర్బన్

వరాల తల్లి వచ్చేసింది..

వరాల తల్లి వచ్చేసింది..