
సరికొత్త మేడారం..!
సంప్రదాయంలో వీసమెత్తు తేడా రాకుండా నిర్మాణాలు
వనదేవతల ప్రాంగణం విస్తరణ, పునర్నిర్మాణానికి శ్రీకారం
సభకు వచ్చిన మహిళలతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
ములుగు: తెలంగాణ కుంభమేళా, వనదేవతల జన జాతర మేడారం రూపుమారనుంది. సమ్మక్క,సారలమ్మ ప్రాంగణాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. వచ్చే జనవరిలో జరిగే మహాజాతరకు శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.150 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో చేపట్టిన పనుల పరిశీలనకు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి మేడారం సందర్శించారు. తల్లుల దర్శనం, మొక్కుల చెల్లింపు, పనుల పరిశీలన, బహిరంగ సభలో ప్రసంగం మొత్తంగా ఆయన పర్యటన మేడారంలో 2.04 గంటలపాటు కొనసాగింది. సీఎంతోపాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తదితరులు ఉన్నారు.
జాతర ప్రాశస్త్యం గుర్తుండి పోయేలా ప్రణాళిక: మంత్రి ధనసరి సీతక్క
జాతర ప్రాశస్త్యం అనేక శతాబ్దాలు గుర్తుండి పోయేలా ప్రణాళిక రూపొందించి మేడారంలో అభివృద్ధి పనులు చేయనున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరమే మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని స్వయంగా ముఖ్యమంత్రితో చర్చించాం. సీఎం సానుకూలంగా స్పందించి అభివృద్ధి ప్రణాళి కలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి తల్లుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గద్దెల విస్తరణ విషయంలో అనేక అపోహలు ఉన్న నేపథ్యంలో నిర్మాణం ఏ విధంగా జరగాలని, గిరిజనుల ఆచార సంప్రదాయాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడడం కోసం సీఎం స్వయంగా మన ప్రాంతానికి రావడం సంతోషంగా ఉంది.
మాస్టర్‌ప్లాన్‌ను విడుదల చేసిన
సీఎం రేవంత్‌రెడ్డి
సమ్మక్క, సారలమ్మకు
మొక్కుల సమర్పణ
అభివృద్ధి పనులు పరిశీలించి
మంత్రులకు సూచనలు
గిరిజన సంప్రదాయాల ప్రకారమే పనులు సాగుతాయని స్పష్టీకరణ
రెండు గంటలపాటు సాగిన ముఖ్యమంత్రి పర్యటన
–ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మేడారం ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రజల ఆత్మీయత, భక్తి, సంప్రదాయాలకు ప్రతీక. వన దేవతల ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. సంప్రదాయానికి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో అందరి అభిప్రాయాలు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా సమ్మక్క–సారలమ్మ ఆలయం ఉంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలి.

సరికొత్త మేడారం..!

సరికొత్త మేడారం..!

సరికొత్త మేడారం..!

సరికొత్త మేడారం..!