
కాలనీలు.. వరద కష్టాలు
ఇందిరమ్మ కాలనీలోకి భారీగా చేరిన వర్షపు నీరు జాతీయ రహదారిపై నిలిచిన వరద
హన్మకొండ అర్బన్/హసన్‌పర్తి: నగరంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు చెరువులను తలపించాయి. ప్రజలకు కునుకు కరువైంది. గ్రేటర్ 49వ డివిజన్‌లోని ఇందిరమ్మ కాలనీ నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటితో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారి చింతగట్టు క్యాంపు సమీపంలోని ఓఆర్‌ఆర్ వద్ద వరదనీరు చేరి వాహనదారులు, పాదచారులు అష్టకష్టాలు పడ్డారు. గుంతల్లో నీరు నిలిచి పలు వురు వాహనదారులు అదుపుతప్పి పడిపోయారు.

కాలనీలు.. వరద కష్టాలు