
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్లో పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే బిల్లుల్లో కోత పెడతానని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను హెచ్చరించారు. 31వ డివిజన్ దీన్‌దయాళ్ కాలనీ, 50వ డివిజన్‌లోని ఇందిరా కాలనీ, రాంపూర్, జవహర్ కాలనీ, గోపాల్ పూర్ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నాణ్యతా ప్రమాణాలు, మేజర్‌మెంట్స్ బుక్స్ (ఎంబీ)ల ఆధారంగా పరిశీలించి కొలతలు వేయించారు. అనంతరం రాంపూర్ ప్రాంతంలో మొక్కలను కమిషనర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఈఈ రవికుమార్, డీఈలు రాగి శ్రీకాంత్, రాజ్‌కుమార్, సారంగం, ఏఈ మేనక, ఉద్యాన విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.