
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి
ఖిలా వరంగల్: పాఠశాలల బలోపేతం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి ఉర్సు గుట్ట సమీపంలోని నాని గార్డెన్‌లో ట్రస్మా వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను సన్మానించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ట్రస్మా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చల్లా నాగార్జున్‌రెడ్డి, బాశెట్టి వెంకటేశ్వర్లు, బాధ్యులు దండపంతుల రామ్మూర్తి, నాసం సూర్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.