
ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందే..
దుగ్గొండి: ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందేనని, సకాలంలో విధులకు హాజరు కాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. బయోమెట్రిక్ హాజరు ప్రకా రం నిర్ధిష్ట సమయానికి చేరుకోవాలన్నారు. మండ ల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ ఇంటి ని ఆమె గురువారం తనిఖీ చేసి, నాణ్యతను పరిశీ లించారు. ఎంత విస్తీర్ణంలో నిర్మించారు. మెటీరియ ల్, క్యూరింగ్ వివరాలపై ఆరా తీశారు. పనులను నాణ్యతగా చేపట్టి త్వరగా చేపట్టాలన్నారు.
తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల తనిఖీ..
తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరును కలెక్టర్ తనిఖీ చేశారు. అయితే డీటీ ఉమారాణి సకాలంలో విధులకు హాజరు కాలేదని గుర్తించి.. ఎందుకు ఆలస్యం అయిందని ప్రశ్నించారు. సమాధానం సరిగా చెప్పకపోవడంతో అగ్రహం వ్యక్తం చేశారు. బస్సు సమయం చెప్పబోతుండగా ‘నేను డ్రైవ్ చేసి డ్రాప్ చేయాలా..’ అని కలెక్టర్ ఆగ్రహించారు. తక్షణమే డీటీ, ఆపరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. భూభారతిలో అందిన దరఖాస్తులు, అర్జీల పరిష్కారం పురోగతిని సమీక్షించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎన్నికల మెటిరియల్ వివరాలు, ఎన్నికల సామగ్రి భద్రపరిచే గదులను పరిశీలించారు. కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ పీడీ గణపతి, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, ఎంపీడీఓ అరుంధతి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుకు
ప్రణాళికలు సిద్ధం చేయాలి
న్యూశాయంపేట: వానాకాలం ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, పౌరసరఫరాలు, సహకార, గ్రామీణాభివృద్ధి శాఖ, తూనికలు కొలతల శాఖాధికారులతో గురువారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025–26 వానాకాలం ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరంలో 2లక్షల50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సుమారు 260 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, డ్రైయ్యర్లు, తాగునీరు, టార్పాలిన్లు, గన్నీబ్యాగులు, తేమ సాంద్రత కొలిచే యంత్రాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం వ్యవసాయ శాఖ అధికారులు ఆయా మండలాల వారీగా ధాన్యం పండించిన రైతుల వివరాల నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ సీజన్‌ల్లో ఏ గ్రేడ్ రకం క్వింటాకు రూ.2,389, కామన్ రకానికి రూ.2,369గా ప్రభుత్వం ధర నిర్ణయించిందని తెలిపారు. సన్నరకం ధాన్యం నాణ్యత గుర్తింపునుకు గ్రేయిన్ కాలిఫర్(డయల్ మైక్రోమీటర్) అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎం సివిల్ సప్లయీస్ సంధ్యారాణి, డీఎస్‌ఓ కిష్టయ్య, డీఎం సురేఖ, డీఆర్డీఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విధులకు హాజరు కాకపోతే
కఠిన చర్యలు తప్పవు
కలెక్టర్ సత్యశారద
ఇందిరమ్మ మోడల్ ఇల్లు తనిఖీ
డీటీ ఉమారాణికి నోటీసులు

ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందే..