జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

Sep 19 2025 1:34 AM | Updated on Sep 19 2025 1:34 AM

జాతీయ

జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

గీసుకొండ: మండలంలోని మరియపురంలోని సెంట్‌జాన్స్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు హైదరాబాద్‌లో నిర్వహించే జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం సిస్టర్‌ సౌజన్య, కరస్పాండెంట్‌ సిస్టర్‌ ఫ్లెవియాలు గురువారం తెలిపారు. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో 8వ తరగతికి చెందిన బొజ్జం శ్రీవర్ష ద్వితీయ స్థానం, కోల పూజ తృతీయ స్థానం, 9వ తరగతికి చెందిన పుంజాల సహస్ర నాల్గవ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

ముగ్గురు దొంగల అరెస్టు

గీసుకొండ: వరుస దొంతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని గీసుకొండ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ నగరంలోని కాశిబుగ్గకు చెందిన పల్లకొండ ఉపేందర్‌, కటకం ప్రణయ్‌, శివనగర్‌కు చెందిన పులిచేరు చంద్రశేఖర్‌ అనే ముగ్గురు పలు ప్రాంతాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మూడు నెలల వ్యవధిలో.. కట్టమల్లన్న దేవాలయంలోని హుండీని పగుల గొట్టారు. మచ్చాపూర్‌లోని పాన్‌షాపు, ఆత్మకూరులోని పాన్‌, కిరాణా షాపుల తాళాలను పగులగొట్టి నగదు, సిగరెట్లు, ఇతర వస్తువులను దొంగిలించారు. ఈక్రమంలో మండలంలోని కోటగండి వద్ద గురువారం సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్సై అనిల్‌కుమార్‌కు అనుమానంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు కనిపించగా వారిని పట్టుకుని విచారించారు. దీంతో వారు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి కొంత నగదు, బైక్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

‘గ్రీన్‌ఫీల్డ్‌ హైవే’ రైతులతో కలెక్టర్‌ సమావేశం

న్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే– 163 నిర్మాణంలో భూములు కోల్పోయిన నెక్కొండ మండలంలోని తోపనపల్లి, అలంఖానిపేట రైతులతో గురువారం కలెక్టర్‌ సత్యశారద అధ్యక్షతన సమావేశం (ఆర్బిట్రేషన్‌) నిర్వహించారు. రైతులకు అవార్డ్‌ పాస్‌ చేసేందుకు ఈ ఆర్బిట్రేషన్‌ సమావేశం నిర్వహించినట్లు సమాచారం. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, ఏఓ విశ్వప్రసాద్‌, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, రైతులు ఉన్నారు.

మూగజీవి ఇకలేదని..

రాయపర్తి: ఎంతో ఆప్యాయంగా పెంచుకున్న కుర్ర(దుడ్డె) ఇకలేదన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఓ మహిళారైతు రోదనలు మిన్నంటాయి. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పానీష్‌తండా గ్రామ పరిధిలోని కొత్తతండాకు చెందిన బానోతు కమలమ్మ తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. కొంతకాలం కిందట ఓ పాడిగేదెను కొనుగోలు చేయగా అది ఓ కుర్ర(దుడ్డె)కు జన్మనిచ్చింది. ఈ క్రమంలో గురువారం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద గడ్డి మేస్తుండగా.. షాక్‌ తగిలి దుడ్డె మృత్యువాత పడింది. దీంతో కమలమ్మ దుడ్డైపె పడి రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది.

క్రీడలతో దేహదారుఢ్యం

వరంగల్‌ అర్బన్‌: క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందుతుందని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఇండోర్‌ స్టేడియం స్టేడియంలో ట్రాన్స్‌కో స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో, డిస్కమ్‌ ఇంటర్‌ సర్కిల్‌ చెస్‌, బాడ్మింటన్‌ పోటీలను సీఎండీ వరుణ్‌రెడ్డి గురువారం ప్రారంభించా రు. కార్యక్రమంలో సీఈ శ్రీరాంకుమార్‌, ఎస్‌ ఈలు నారాయణరెడ్డి, గౌతంరెడ్డి, స్పోర్ట్స్‌ ఆఫీస ర్‌ నీలం జగన్నాథ్‌, ప్రతినిధులు వెంకటేశ్వర్లు, చంద్రప్రకాశ్‌, రాజిరెడ్డి, మోహన్‌ పాల్గొన్నారు.

జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక 
1
1/3

జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక 
2
2/3

జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక 
3
3/3

జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement