ప్రాణాలు తీస్తున్న అర్హతలేని వైద్యం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీస్తున్న అర్హతలేని వైద్యం

Sep 19 2025 1:34 AM | Updated on Sep 19 2025 1:34 AM

ప్రాణాలు తీస్తున్న అర్హతలేని వైద్యం

ప్రాణాలు తీస్తున్న అర్హతలేని వైద్యం

సాక్షి, వరంగల్‌: ఆర్‌ఎంపీలు, పీఎంపీలు అత్యవసర సమయంలో రోగులకు ప్రథమ చికిత్స అందిస్తూ వైద్యసలహాలు మాత్రమే ఇవ్వాలి.. కానీ అర్హత లేని వైద్యం చేస్తూ ప్రాణాలమీదకు తెస్తున్నారు. కొందరు .. ఏశాస్త్రం చదవకున్నా, ఏ అర్హత, అనుమతి లేకున్నా వైద్య నిపుణుల్లా చలామణి అవుతుండడంత గమనార్హం. చాలామంది ఆస్పత్రులు తెరిచి ఇంజక్షన్లు ఇస్తూ, సైలెన్లు ఎక్కిస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. వైద్యం వికటిస్తే ప్రైవేట్‌ కా ర్పొరేట్‌ ఆస్పత్రులకు తరలించి చేతులు దులుపుకొంటున్నారు. మరికొందరు తమకు తెలిసిన ప్రైవే ట్‌ ఆస్పత్రులకు రోగులను రిఫర్‌ చేసి కమీషన్లు దండుకుంటున్నారు.

పట్టించుకోని జిల్లా అధికారులు

ఇటీవల బొడ్డు రాము అనే బీటెక్‌ విద్యార్థి.. నకిలీ డాక్టర్‌ అందించిన వైద్యం వికటించి మృతిచెందా డు. నిబంధనలు ధిక్కరించినా.. ప్రాణాలు పోతు న్నా.. ఆ శాఖ జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదు. దీనిపై రాష్ట్ర వైద్య మండలి స్పందించి నకిలీ వైద్యుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. ఇటీవల జి ల్లా వ్యాప్తంగా నకిలీ వైద్యులపై కేసులు నమోదు అవుతున్నా తీరు మారడంలేదు. వీరిపై హైదరాబా ద్‌లోని వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదులు అందడంతో దాడులు చేసి పోలీసులతో కేసులు నమోదు చేయిస్తే రాజకీయ అండదండలతో తిరిగి వైద్యం చేస్తున్నట్లు తెలుస్తుంది.

18 మందిపై కేసు నమోదు..

మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ లాలయ్య కుమా ర్‌ ఆదేశాలతో చైర్మన్‌ డాక్టర్‌ మహేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం కౌన్సిల్‌ సభ్యుల బృందాలు జిల్లాలోని 12 ప్రాంతాల్లోని అనాధికార (పీఎంపీ, ఆర్‌ఎంపీ) వైద్యులపై ఏక కాలంలో దాడులు నిర్వహించి, 18 మంది నకిలీలను గుర్తించాయి. శివనగర్‌కు చెందిన బండి రమేష్‌, రాములు, పెరుకవాడకు చెందిన రుద్ర భాస్కర్‌, ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన టి.రాజమౌళి, శివనగర్‌కు చెందిన బి.లక్ష్మీనారాయణ, చింతల్‌కు చెందిన డి.సురేష్‌, మహమ్మద్‌, శుంభునిపేట దూపకుంట రోడ్డులో కిరణ్‌, రామన్నపేటకు చెందిన రాజేంద్రప్రసాద్‌, గోకులనగర్‌కు చెందిన డి.రవీందర్‌, రాజానర్సయ్య, వై.రమేష్‌, కుమారస్వామి, శ్రీనివాస్‌, ఆర్‌.వీరనారాయణ, దుగ్గొండి గ్రామానికి చెందిన శ్రీధర్‌, కిరణ్‌, సాంబయ్య, భిక్షపతి, లేబర్‌కాలనీకి చెందిన శేఖర్‌ ను గుర్తించి ఆయా ఏరియాల్లో పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

జిల్లాలో ఆర్‌ఎంపీలు, పీఎంపీ క్లినిక్‌లపై వైద్యమండలి దాడులు

నకిలీ వైద్యులపై ఫిర్యాదు

ఆర్‌ఎంపీలు, పీఎంపీలపై

క్రిమినల్‌ కేసులు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement