
డివిజన్లలో సమస్యలు పరిష్కరించాలి
● సమీక్షలో గ్రేటర్ కమిషనర్
చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: డివిజన్లలోని సమస్యల పరిష్కారానికి వార్డు ఆఫీసర్లు కృషిచేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ హెచ్చరించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో 27 మంది వార్డు ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు పంపిణీ చేశారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, పన్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఆర్‌ఓలు శ్రీనివాస్, షహాజాదీ బేగం, ఆర్‌ఐలు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.
శానిటేషన్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి..
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఎస్‌డబ్ల్యూఎం), జీఐఎస్, ఈ–ఇంటిగ్రేషన్ మొబైల్ అప్లికేషన్ (యాప్) సంబంధిత అంశాలపై శానిటేషన్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాయంలోని ఐసీసీసీలో జరిగిన సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. ఐసీసీసీ ఇన్‌చార్జ్ తేజస్వి, సిబ్బంది నరసింహ, నరేశ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల నుంచి చెత్త సేకరించాలి..
ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ అన్నారు. 31వ డివిజన్ న్యూ శాయంపేటలో గురువారం ఉదయం కమిషనర్ శానిటేషన్, నీటి సరఫరా పర్యావేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇళ్ల నుంచి చెత్తను సేకరించాలన్నారు. ఈఈ రవికుమార్, ఏ ఈ సౌజన్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.