
క్రీడాపోటీల్లో విద్యార్థుల ప్రతిభ
నెక్కొండ: 69వ ఎస్‌జీఎఫ్ జోనల్ మీట్‌లో తమ విద్యార్థులు ప్రతిభచాటారని నెక్కొండ టీజీ గురుకుల పాఠశాల/కళాశాల (బాలికల) ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను గురువారం పాఠశాలలో ఆమె అభినందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... ఈ నెల 16, 17 తేదీల్లో చెన్నారావుపేట సిద్ధార్థ గురుకుల విద్యాలయంలో ఎస్‌జీఎప్ జోనల్ మీట్‌లో భాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారని తెలిపారు. ఈ పోటీల్లో అండర్ 17, 14 విభాగాల్లో అత్యంతం ప్రతిభచాటి ప్రథమ స్థానంలో విజేతలుగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. ఆయా జట్ల కెప్టెన్లు సాత్విక, నందు తోపాటు క్రీడాకారులను పీఈటీ కమలకుమారి, ఉపాధ్యాయులు అభినందించారు.