
దళిత కాలనీలను సుందరీకరిస్తాం
● నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి
దుగ్గొండి: నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దళిత కాలనీలను సుందరీకరిస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.53 లక్షలతో మండలంలోని తొగర్రాయి, మందపల్లి, మధిర, అడవిరంగాపురం గ్రామాల్లో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన బుధవారం ప్రారంభించి, మాట్లాడారు. దళితులకు ఇళ్లు, దళిత కాలనీల్లో రోడ్లు, మంచినీటి వసతి కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే అందాయని గుర్తు చేశా రు. అన్ని దళిత కాలనీల్లో సీసీ రోడ్డుతోపాటు డ్రె యినేజీలు నిర్మిస్తామన్నారు. ఇళ్లులేని వారికి ప్రాధాన్యతా క్రమంలో రాజకీయాలకు అతీతంగా ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. బతుకమ్మ సంబరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్‌తోనే గ్రామాల సమగ్రాభివృద్ధి
నర్సంపేట: కాంగ్రెస్‌తోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండలం లింగాపురం, కోనాపురం, ఉప్పరపల్లి, అక్కల్‌చెడ, అమీనబాద్, బోజెర్వు, లింగగిరి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి, మహిళా సంఘాల భవనాలకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద సుమారు రూ.2కోట్ల 30లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మార్కె ట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్, ఎర్రల్ల బాబు, కిరణ్‌రెడ్డి, నర్సింగరావు, రాజేశ్వర్‌రావు, ఎడెల్లి శ్రీనివాసరెడ్డి, దంజ్యా, రామారావు, బండి రాజమల్లు, అమ్మరోహిత్, నర్సింహారెడ్డి, తిరుపతి, రాజేశ్వరాచారి, సుమలత, బుర్రి సునిత, కూనమల్ల శ్రీనివాస్, పుప్పాల శ్రీనివాస్, నగేష్, ఎంపీడీఓ శ్రీవాణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.