
క్వాంటం సైన్స్‌పై అవగాహన ఉండాలి
రామన్నపేట : విద్యార్థులకు క్వాంటం సైన్స్‌పై అవగాహన ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి రంగ య్య నాయకుడు అన్నారు. నగరంలోని మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘క్వాంటం యుగం ప్రా రంభం– అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ ముగింపు సమావేశంలో డీఈఓ మాట్లాడారు. సాంకేతికంగా ప్రపంచం దూసుకెళ్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న సూపర్ కంప్యూటర్లు 1,000 సంవత్సరాలు తీసుకొని చేయగలిగే పనిని రానున్న క్వాంటం కంప్యూట ర్లు కొన్ని సెకండ్ల వ్యవధిలో చేయగలగుతాయని అన్నారు. సాంకేతిక విస్పోటనం జరుగుతున్న తరుణంలో విద్యార్థులు క్వాంటం సైన్స్‌పై, శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న పలు మార్పులపై అవగాహ న కలిగి పెంచుకోవాలని తెలిపారు. ఈ సెమినార్‌లో చెన్నారావుపేట మండలం లింగాపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని బూర మానస మొదటి స్థానం నిలిచి ఎస్సీఈఆర్టీలో జరగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌కు అర్హత సాధించింది. శ్రీ సరస్వతి విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థి సహస్రాక్ష్ ద్వితీ య స్థానం, నర్సంపేట అక్షర హైస్కూల్ విద్యార్థిని హరిప్రియ తృతీయ స్థానం కై వసం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం విజేతలకు, పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. న్యాయ నిర్ణేతలు పింగిళి కళాశాల కంప్యూటర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభ, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు పెట్లోజు సురేష్, దేవులపల్లి కిరణ్ వ్యవహరించగా, మట్టెవాడ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అరుణ ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, వారి గైడ్ టీచర్లు పాల్గొన్నారు.
డీఈఓ రంగయ్య నాయుడు