ఒకే ఒక్కడు.. | - | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కడు..

Sep 19 2025 1:38 AM | Updated on Sep 19 2025 1:38 AM

ఒకే ఒ

ఒకే ఒక్కడు..

హన్మకొండ చౌరస్తా: ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు దక్కించుకోవడానికి కాంట్రాక్టర్లు పోటీపడుతుంటారు. అవసరమైతే సిండికేట్‌గా ఏర్పడి ఒక్కరే దక్కించుకుంటారు. అయినా కుదరకపోతే రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తారు. అందుకు పూర్తి విరుద్ధంగా మత్స్యశాఖ ఆహ్వానించిన టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ముందుకురావట్లేదు. మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం హనుమకొండ జిల్లా మత్స్యశాఖ అధికారులు టెండర్లు ఆహ్వానించగా ఒక్కరే దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రతీ ఏటా ఉచిత చేప పిల్లల పంపిణీకి తీవ్ర పోటీ ఉండగా, గతేడాది నుంచి టెండర్లు వేసేందుకు ఒకరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ రావడం లేదని మత్స్యశాఖ అధికారిక లెక్కలే చెబుతున్నాయి.

హనుమకొండ జిల్లాలో మొత్తం 813 చెరువులు

హనుమకొండ జిల్లాలో మొత్తం 813 చెరువులు ఉండగా గత సంవత్సరం 763 చెరువుల్లో రూ.82.82 లక్షల విలువైన 111.21 లక్షల ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసినట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. కట్ల, రోహు, బంగారుతీగ, మెరిగ జాతి చేపపిల్లలను చెరువుల్లో వదిలారు. అదే మాదిరి ఈ సంవత్సరం సైతం చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ టెండర్లను ఆహ్వానించింది. టెండర్లకు ఈ నెల 12 చివరి తేదీగా పేర్కొంది.

ఒక్కరే టెండర్‌ దాఖలు..

ఈ సంవత్సరం జెశ్వంత్‌ ఆక్వాఫామ్స్‌ ప్రైవేట్‌ సంస్థ, భీమారం పేరుతో ఒక్కరే టెండర్‌ వేసినట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే సదరు సంస్థ ఎన్ని చెరువులకు, ఎంతకు కోట్‌ చేస్తారనే విషయం బిడ్‌ తెరిస్తే కానీ తెలియదు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్‌ దాఖలైతే తిరిగి మరోసారి ఆహ్వానించాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు.

● ఇప్పటికే సెప్టెంబర్‌ నెల సైతం గడిచిపోతోంది. టెండర్లు పూర్తయి చేపపిల్లలు చెరువులకు ఎప్పుడు చేరుతాయనేది మత్స్యకారుల ప్రశ్న.

బకాయిలే కారణమా?

● గతేడాది జిల్లాలోని 813 చెరువుల్లో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసేందుకు రెండు సంస్థలు టెండర్లను దక్కించుకున్నాయి. అందులో ఓబులాపూర్‌, జఫర్‌గఢ్‌, జనగామకు చెందిన బైరీ పట్టాభి, సాయినాథ్‌ ఫిష్‌ సీడ్‌ ఫామ్‌ 571 చెరువుల్లో 84,79,477 చేప పిల్లలను పంపిణీ చేసేందుకు రూ.6,53,170 లక్షలకు కాంట్రాక్టును దక్కించుకుని ఆయా చెరువుల్లో వదిలింది. ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన ప్రభుత్వం సదరు కాంట్రాక్టర్‌కు రూ.24,11,1846 లక్షలు మాత్రమే చెల్లించింది. ఇప్పటికీ బైరీ పట్టాభి, సాయినాథ్‌ ఫిష్‌ సీడ్‌ ఫామ్‌కు రూ.41,19,861 లక్షలు చెల్లించాల్సి ఉంది.

● మరో 179 చెరువులకు పంపిణీ చేసేందుకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన ముల్కనూరు ఫిష్‌ హాచరీస్‌ సంస్థ రూ.17,50,321 లక్షలతో 23,85,067 చేప పిల్లల పంపిణీకి టెండర్లను దక్కించుకుని అందజేసింది. ఆ సంస్థకు రూ.5,47,967 మాత్రమే చెల్లించిన ప్రభుత్వం, రూ.12,02,354 బకాయి ఉంది.

క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి..

హనుమకొండ జిల్లా పరిధి చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి ఒక్కరు టెండరు దాఖలు చేశారు. టెండర్‌ వేసిన సంస్థకు సీడ్‌ సరఫరా చేసే సమర్థత ఉందా? లేదా? అనేది ఫీల్డ్‌ ఎంకై ్వరీ చేయాల్సి ఉంది. ఆ తర్వాత బిడ్‌ తెరవాల్సి ఉంటుంది. గత సంవత్సరం సరఫరా చేసిన సంస్థలకు బకాయి అంశం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది.

– నాగమణి, ఇన్‌చార్జ్‌ జిల్లా మత్స్యశాఖ అధికారి, హనుమకొండ

చేప పిల్లల పంపిణీకి

ముందుకురాని కాంట్రాక్టర్లు

జిల్లాకు టెండర్‌ వేసింది ఒక్కరే

గతేడాది బకాయిలే కారణమా?

ఆ ఒక్క బిడ్‌ను తెరిచేదెన్నడో?

ఒకే ఒక్కడు.. 1
1/1

ఒకే ఒక్కడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement