
కనీస ప్రమాణాలు పాటించాలి
అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి
హన్మకొండ అర్బన్: జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలు కనీస ప్రమాణాలు పాటించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరెట్‌లో జిల్లా సంక్షేమ అధికారి జయంతి అధ్యక్షతన జిల్లా ఇన్‌స్పెక్షన్ కమిటీ, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులతో సమన్వయ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల సంరక్షణ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాల బాలికలకు నిర్వాహకులు వసతి, భోజనం, విద్యా, వైద్యంతో పాటు సరైన వసతులు కల్పించాలన్నారు. ఈనెల 20 నుంచి 26 వరకు జిల్లాలోని ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను అదనపు కలెక్టర్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ బృందం ఆధ్వర్యంలో తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ.. సీజన్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్‌రావు, బాల రక్షా భవన్ కో–ఆర్డినేటర్ సీహెచ్ అవంతి, జిల్లా బాలల పరిరక్షణ ఇన్‌చార్జ్ అధికారి ప్రవీణ్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్, పరికి సుధాకర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.