
అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
పరకాల: విద్యార్థినుల్లో అభ్యసన, పఠన సామర్థ్యాలను పెంచాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. పరకాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలతోపాటు గిరిజన వసతి గృహాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. వంట, తరగతి గదులు, డార్మెటరీ, భోజనాన్ని పరిశీలించడంతోపాటు పలు రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ విద్యార్థినులతో తరగతి గదిలోని బోర్డులపై రాయించి చదివించారు. చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు అవుతామని సమాధానమిచ్చారు. అయితే అందుకు కావాల్సిన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థినులకు కలెక్టర్ సూచనలు చేశారు. పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ ఆంజనేయులు పాల్గొన్నారు.