
మహిళ ఆరోగ్యంతోనే కుటుంబం ఆరోగ్యం
● వరంగల్ ఎంపీ కడియం కావ్య
హన్మకొండ: మహిళ ఆరోగ్యంతోనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియా న్‌లో భాగంగా బుధవారం హనుమకొండ సమ్మయ్యనగర్‌లోని లష్కర్‌సింగారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయస్థాయిలో ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన తర్వాత ఈ మెగా వైద్యశిబిరాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి కడియం కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళలకు అవసరమైన వైద్యసేవలందించాలని డాక్టర్లు, సిబ్బందికి సూచించా రు. టీబీ ముక్త్ అభియాన్‌లో భాగంగా దాతలు అందించిన పోషకాహార కిట్‌లను టీబీ వ్యాధిగ్రస్తులకు అందించారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయకుమార్, డాక్టర్లు అజిత్ మహమ్మద్, సుదీప్, ప్రశాంత, హారిక, హిమబిందు ఉన్నారు.