
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి
హసన్‌పర్తి: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషి చేయాలని కేయూ పాలక మండలి సభ్యురాలు, నార్కొటిక్స్ విభాగం యాంటీ డ్రగ్స్ కమిటీ సభ్యురాలు డాక్టర్ అనితారెడ్డి సూచించారు. కిట్స్ కళాశాలలో యాంటీ డ్రగ్స్‌పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయించినా, కొనుగోలు చేసినా నేరంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ బారినపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. విద్యార్థులను డ్రగ్స్ విక్రయదారులు పావులా వాడుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్స్ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సదస్సులో కిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌రెడ్డి, కేయూసీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ప్రొఫెసర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.