
నాబార్డ్ అధికారుల పర్యటన
ఎల్కతుర్తి : భీమదేవరపల్లి మండలంలో నాబార్డ్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ జాంబ్రే పర్యటించారు. బుధవారం మండలంలోని ముస్తఫాపూర్ గ్రామంలో ఏకే విశ్వనాథరెడ్డి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ షెడ్ కార్యక్రమంలో భాగంగా సోలార్ కంచె, సోలార్ పశుగ్రాసం, బయోగ్యాస్, మొబైల్ స్టార్టర్, మొక్కల పెంపకాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ, భూసార యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. అనంతరం మత్స్య సహకార సంఘానికి చేపపిల్లల కొనుగోలుకు చెక్కు అందజేశారు. నాబార్డ్ వరంగల్ క్లస్టర్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ చంద్రశేఖర్, ఏజీఎం చైతన్య రవితంగ, దేవేందర్, సభ్యులు పాల్గొన్నారు.