
రైతులకు పరిహారం అందిస్తాం..
భూ నిర్వాసితుల సమావేశంలో ఆర్డీఓ
వేలేరు : కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తరఫున పరిహారం అందిస్తామని హనుమకొండ ఆర్డీఓ రమేశ్ రాథోడ్ తెలిపారు. బుధవారం గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి మండలంలోని ఎర్రబెల్లి గ్రామానికి వచ్చే కాల్వ కింద భూములు కోల్పోతున్న రైతులతో తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరువు ప్రాంతమైన ఎర్రబెల్లిలో కెనాల్ ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 2వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని అన్నారు. భూ సేకరణకు రైతులందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ హెచ్.కోమి, ఆర్‌ఐ సురేందర్, సీనియర్ అసిస్టెంట్ హేమ నాయక్, సిబ్బంది ఉన్నారు.