
నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి
● కలెక్టర్ స్నేహ శబరీష్
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలంలో బుధవారం కలెక్టర్ స్నేహ శబరీష్ పర్యటించారు. ఇంకుడు గుంతల నిర్మాణ పనుల్ని త్వరగా మొదలుపెట్టి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. ముల్కనూరులోని మోడల్ స్కూల్ సమీపంలో ఇటీవల మంజూరైన ఇంకుడు గుంతల్ని నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు. మోడల్ స్కూల్‌లో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లు, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. మోడల్ స్కూల్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని త్వరగా పూర్తిచేయాలన్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం అంగ న్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట జి ల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, పంచా యతీ అధికారి లక్ష్మీరమాకాంత్, ఈఈ ఆత్మారాం, డీఈ శిరీష, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.
కంకర అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టే వారికి అధిక ధరలకు కంకర విక్రయించే క్రషర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలి లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం కంకర ఒక ట్రిప్పు రూ.4,200 తీసుకుంటున్నట్లు లబ్ధి దారులు చెప్పగా.. ప్రభుత్వం కేటాయించిన ధరల కే ఇంటి నిర్మాణ సామగ్రిని విక్రయించాలని వ్యాపారులకు సూచించారు. ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలో ఏర్పాటు చేసిన ఇసుక బజార్‌ను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వినియోగించుకోవాలన్నారు.