
నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి
● ఎంపీ ఈటల రాజేందర్
దామెర: గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని మల్కాజ్‌గిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం భూపాలపల్లిలో నిర్వహిస్తున్న సమావేశానికి ఈటల రాజేందర్ మండలంలోని ఊరుగొండ మీదుగా వెళ్తుండగా.. విషయం తెలుసుకున్న భూ నిర్వాసితులు గ్రామ బస్టాప్‌లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కోట్ల రూపాయలు విలువచేసే, మూడు పంటలు పండే భూములను తక్కువ ధరకు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. ఊరుగొండలో ఎంపీ రాజేందర్‌కు బీజేపీ నాయకులు పడగాల కాళీప్రసాదరావు, గురిజాల శ్రీరాంరెడ్డి, పిట్టల రమేశ్, పౌడాల మధుకర్ తదితరులు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.