
జీఓ 99ని ఉపసంహరించాలి
గీసుకొండ: మాలల హక్కులకు వ్యతిరేకంగా రూపొందించిన జీఓ 99ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుప్పరి నర్సింహస్వామి, జిల్లా అధ్యక్షుడు బొల్లం రాంకుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జీఓ రద్దు కోసం ఈనెల 8న జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడికి మాలలు తరలిరావాలని కోరారు. వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నాయకులు ఉసిల్ల ఉదయ్‌కుమార్, గరిగె అనిల్, పసుల కుమారస్వామి, భరత్, యుగేందర్, చిదుల విష్ణు పాల్గొన్నారు.