
కాంగ్రెస్ సంబురాలు
రామన్నపేట : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో సోమవారం పోచమ్మ మైదాన్‌లో ఆ పార్టీ నాయకులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్పొరేటర్లు గుండేటి నరేందర్, శిరీష శ్రీమాన్, మాజీ కార్పొరేటర్లు తత్తరి లక్ష్మణ్, దామెర సర్వేషం, బిల్ల శ్రీకాంత్, జన్ను రవి, దుపం సంపత్, జన్ను అరుణ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరమేష్, యూత్ కాంగ్రెస్ తూర్పు అధ్యక్షుడు ఎండీ సలీం, నాయకులు వరుణ్, రాజు, ప్రభాకర్, సదానందం, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.