
వినతులు త్వరగా పరిష్కరించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్
● ప్రజావాణిలో 179 దరఖాస్తుల స్వీకరణ
హన్మకొండ : ప్రజావాణిలో పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు 179 వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, పలు శాఖల ఉన్నతాధికారులు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆస్పత్రి స్థలాన్ని కబ్జా చేశారు
ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ పీహెచ్‌సీ స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సోమవారం కలెక్టర్‌లో వినతిపత్రం అందజేశా. ఆరు గుంటల ప్రభుత్వ భూమిని అక్రమించుకున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. గతంలో ఫిర్యాదు చేయగా తహసీల్దార్‌ను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని కోరా.
– ఖాజా మోహినుద్దీన్, కేశవాపూర్

వినతులు త్వరగా పరిష్కరించాలి