
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
● ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు
హన్మకొండ అర్బన్ : ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జంక్షన్‌నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలపగా, రాజేందర్ మాట్లాడారు. వృద్ధాప్యంలో లక్షలాది ఉద్యోగుల భద్రతను, కు టుంబాల సంక్షేమాన్ని బలి తీసుకున్న స్కీమ్ సీపీఎస్ అని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించకుండా పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా సీపీఎస్ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల జేఏసీ నేతలు అన్నమనేని జగన్‌మోహన్‌రావు, బైరి సోమయ్య, రాజు, గణిపాక రాజ్‌కుమార్, కిరణ్ గౌడ్, ప్రవీన్ కుమార్, వేణుగోపాల్, పుల్లూరు వేణుగోపాల్, సదానందం, రాజేష్, రాజేష్ కుమార్, హేమ నాయక్, నరేందర్ నాయక్, మోహన్ రెడ్డి, భిక్షపతి, సర్వన్, గోపాల్‌రెడ్డి, కత్తి రమేష్, శ్యామ్ సుందర్, సాంబయ్య, రాజు, రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.