
పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్స్
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ సెక్షన్స్‌కు ఈ విద్యాసంవత్సరం అవకాశం కల్పించింది. హనుమకొండ జిల్లాలో రెండు దశల్లో కలిపి 48 ప్రభుత్వ పాఠశాలలకు మంజూరు లభించింది. ఇందులో ఇప్పటికే 16 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ సెక్షన్లు కొనసాగుతున్నాయి.
హనుమకొండ జిల్లాలో మంజూరైన
పాఠశాలలు..
ఎంపీపీఎస్ భీమపల్లి, ప్రభుత్వ హైస్కూల్ జులైవాడ, ఎంపీయూపీఎస్ మైలారం, ఎంపీపీఎస్ శాయంపేట, ఎంపీపీఎస్ గట్లనర్సింగాపూర్, ఎంపీపీఎస్ మడికొండ, ఎంపీపీఎస్ కుమ్మరిగూడెం, ఎంపీపీఎస్ కొత్తపల్లి, ఎంపీపీఎస్ పెద్దకోడెపాక, ఎంపీపీఎస్ రసూల్‌పల్లి, ఎంపీపీఎస్ పలివేల్పుల, ప్రభుత్వ ప్రైమరీ స్కూల్, ఎంపీపీఎస్ ధర్మారం, యూపీఎస్ ఆర్‌ఈసీ పాఠక్, ఎంఏపీఎస్ కన్నారం, ఎంపీపీఎస్ వంగర, ఎంపీయూపీఎస్ గోపాలపురం, ఎంపీపీఎస్ ఎర్రబెల్లి, ఎంపీపీఎస్ గుండ్లసింగారం, యూపీఎస్ ముస్తాఫాపూర్, ఎంపీపీఎస్ పరకాల, ఎంపీయూపీఎస్ మైలారం, ఎంపీయూపీఎస్ ప్రగతిసింగారం, ఎంపీపీఎస్ ఊరుగొండ, ఎంపీపీఎస్ సీతారాంపూర్, ఎంపీయూపీఎస్ రత్నగిరి, ఎంపీపీఎస్ మాణిక్యాపూర్, ఎంపీపీఎస్ ఎస్సీకాలనీ ముల్కనూరు, ఎంపీపీఎస్ ముల్కనూరు, ఎంపీపీఎస్ బావుపేట, ఎంపీపీఎస్ కేశవపూర్, ప్రభుత్వ పీఎస్ కాజీపేట, ప్రభుత్వ పీఎస్ గొల్లపల్లి, ప్రభుత్వ పీఎస్ పాలెం, ఎంపీయూపీఎస్ కనిపర్తి, ముప్పారం, కోమటిపల్లి, గోపాల్‌పూర్, శంభునిపల్లి, సోడాషపల్లి, హెచ్‌సీఎన్‌తండా, ప్రభుత్వ పీఎస్ ప్రాక్టీసింగ్ స్కూల్, ప్రభుత్వ పీఎస్ రాంనగర్, ప్రభుత్వ పీఎస్ మర్కజీ, ఎంపీపీఎస్ దామెర, వరికోలు, అక్కంపేటను ఎంపిక చేశారు.
వరంగల్ జిల్లాలో..
ఎంపీపీఎస్ వంచనగిరి, నాచినపల్లి, కాపులకనపర్తి, నెక్కొండ గర్‌ల్స్, వండ్లకొండ, పొనకల్, ఎంపీయూపీఎస్ డీసీతండా, చంద్రతండా, హనుమాన్‌దేవల్, రేకులతండా, అవుసలితండా, పెద్దమ్మగడ్డ, హాట్యాతండా, ముసుకులపల్లి, ఎంపీయూపీఎస్ డీసీ తండా అమీన్‌పేట్, ప్రభుత్వ యూపీఎస్ డీఎన్‌టీ బాలాజీనగర్, ప్రభుత్వ పీఎస్ దేశాయిపేట, ప్రభుత్వ పీఎస్ నరేంద్రనగర్, జెడ్పీహెచ్‌ఎస్ ముచ్చింపుల ఉన్నాయి. ఇప్పటికే మొదటిదశలో 13 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్స్ షురూ అయ్యాయి. మొత్తంగా వరంగల్ జిల్లాలో 32 ప్రీప్రైమరీ సెక్షన్స్‌కు మంజూరు లభించింది.
మార్గదర్శకాలు ఇలా..
2026–2027లో ఒకటో తరగతిలో చేరే అవకాశం ఉన్న పిల్లలను 2025–2026 లో ప్రీప్రైమరీలో చేర్చాల్సి ఉంటుటుంది. ఆర్‌టీఈ చట్టానికి అనుగుణంగా వయస్సు, నిర్ధారణ పత్రాలు అవసరం. యూడైస్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.
సదుపాయాలు..
పిల్లలకు విద్యాబోధనకు అనుకూలమైన ప్రత్యేక తరగతిగది ఉండాలి.శుభ్రమైన మరుగుదొడ్లు, ఆటసామగ్రి, సౌకర్యవంతమైన కాంతి, గాలిప్రవాహం అవసరం .
మానవ వనరులు
ఒక్కో పాఠశాలలో ప్రీప్రైమరీ సెక్షన్‌కు ఒక ఇన్‌స్ట్రక్టర్, ఒక ఆయాను నియమించాలి. వీరిని తాత్కాలిక పద్ధతిలోనే ఎంపికచేస్తారు. వీరికి పది నెలలపాటు మాత్రమే విధులుంటాయి. ఇన్‌స్ట్రక్టర్‌కు మాత్రం నెలకు రూ.10 వేల వేతనం ఉంటుంది.
పాఠ్యాంశాలు..
ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన కార్యక్రమం అండ్ ఎన్‌సీఎఫ్–ఎఫ్‌ఎస్ నిబంధనల ఆధారంగా ఉంటుంది. కార్యాచరణ ఆధారిత విద్యావిధానాలు, పర్యావరణంలోని అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యం. పిల్లలకు ఆరోగ్య, పోషణ, భద్రత ఉండేలా చూడాలి. మధ్యాహ్న భోజనం ఉంటుంది. వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలి. అవసరమైన సామగ్రిని కొనుగోలుచేయాలి. పాఠశాలస్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పర్యవేక్షణలో కొనుగోలు చేయవచ్చు.
తల్లిదండ్రులతో సమావేశాలు
తల్లిదండ్రుల సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని హెచ్‌ఎంలు పర్యవేక్షించాలి.
హనుమకొండ జిల్లాలో రెండు దశల్లో 48, వరంగల్ జిల్లాలో మరో 19 స్కూళ్ల ఎంపిక