
మత్తడి పోస్తున్న మగ్ధుంపురం ఊర చెరువు
నర్సంపేట: చెన్నారావుపేట మండలంలోని మగ్ధుంపురం గ్రామ శివారులోని ఊర చెరువు మత్తడి పోసింది. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువులోకి వరద నీరు భారీగా చేరడంతో ఆదివారం ఉదయం ఊర చెరువు మత్తడి పోసింది. దీంతో రైతులు ఈ ఏడాది పంటలకు ఢోకా లేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి ముసుగులో దోచుకున్న బీఆర్‌ఎస్
పరకాల: అధికారాన్ని అడ్డంపెట్టుకొని అభివృద్ధి ముసుగులో బీఆర్‌ఎస్ తెలంగాణను దోచుకుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. పామ్ హౌస్‌లో జరిగిన పాపాలు కడుక్కోవడానికే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కుట్టుమిషన్లు పంపిణీ చేశారని, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మొరం దోపిడీ చేసిన పెద్ద దొంగ అని ఆరోపించారు. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రోడ్డు వెడల్పు పేరుతో ఇండ్లు కూల్చి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ దిగజారుడు మాటలు మానుకోకపోతే తీవ్రపరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, కుంకుమేశ్వరస్వామి దేవస్థానం చైర్మ న్ కొలుగూరి రాజేశ్వర్‌రావు, మాజీ కౌన్సిలర్ పంచగిరి జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్‌పై మక్కువతో పాటల రచన
నెక్కొండ: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మక్కువతో ఓ గిరిజన యువకుడు అనేక పాటలు రచించి పలువురిని ఆకట్టుకుంటున్నాడు. గుంటూరు జిల్లా కేంద్రంలోని మామిడి గార్డెన్‌లో ఆదివారం జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమ్మేళనంలో నెక్కొండ మండలంలోని బొల్లికొండ గ్రామానికి చెందిన పాటల రచయిత బాబులాల్ నాయక్ రచించిన పాటల సీడీని ఏపీ సోషల్ మీడియా ప్రతినిధి బాబుల్ తుమ్మ ఆవిష్కరించారు. అనంతరం బాబుల్ తుమ్మ మాట్లాడుతూ.. బాబులాల్ నాయక్ గతంలో జగన్ పాదయాత్రపై పాటలు రచించి ఆదరణ పొందాడని అన్నారు. ఇటీవల పవర్ ఆఫ్ వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా పాటలు రచించాడు. జగన్‌పై ఉన్న అభిమానంతో మరిన్ని పాటలు రచించేందుకు బాబులాల్‌నాయక్ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పాటలు నాయక్ లిరిక్స్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో వీక్షించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్‌మీడియా ప్రతినిధులు కల్లం హరికృష్ణరెడ్డి, నాగేష్ గంగుల, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒకే జిల్లాగా
హనుమకొండ, వరంగల్
హన్మకొండ: హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి ఒకే వరంగల్ జిల్లాగా ప్రకటించాల ని, ఉత్తర తెలంగాణ కేంద్రంగా తీర్చిదిద్దాలని పౌర సమాజం డిమాండ్ చేసింది. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీ య హోటల్‌లో తెలంగాణ ఉద్యమకారుల వేది క, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్‌ను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కాకుండా రాజకీయంగా ఎదగకుండా గత పాలకులు విభజించారన్నారు. ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ మాట్లాడుతూ.. వరంగల్, హనుమకొండ జిల్లాల అభివృద్ధి పరస్పరం ఆధారపడి ఉందన్నారు. వీటిని ఒక్కటి చేసేలా నాయకులు చొరవ చూపాలన్నారు. వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు , విశ్లేషకులు పాల్గొన్నారు.

మత్తడి పోస్తున్న మగ్ధుంపురం ఊర చెరువు

మత్తడి పోస్తున్న మగ్ధుంపురం ఊర చెరువు