
లబ్ధిదారులు నిబంధనలు పాటించాలి
నెక్కొండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు నిబంధనలు పాటించాలని నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు. ఇంతకాలం బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మోసంతో విసిగివేసారిన పేదోడి ఇంటి కల నేరవేర్చుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. లబ్ధిదారులు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆయన సూచించారు. దశలవారీగా ఇప్పటికే ఒక్కో లబ్ధిదారుడికి రెండు నుంచి మూడు దఫాలుగా డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి సాయికృష్ణ, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లావుడ్య తిరుమల్, మండల ఉపాధ్యక్షుడు పొలిశెట్టి భానుప్రకాశ్, సోషల్ మీడియా ప్రతినిధి రావుల తిరుపతిరెడ్డి, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు రామారపు శిరీష, నాయకులు ఈదునూరి ప్రభాకర్, రామారపు రాము, దుర్గాల అశోక్, ఈదునూరి, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ ఏఎంసీ చైర్మన్ హరీశ్‌రెడ్డి