
బెంగళూరుకు చార్జీల తగ్గింపు
హన్మకొండ: హైదరాబాద్–బెంగళూరు మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల చార్జీలు తగ్గించినట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత తెలిపారు. లహరి, సూపర్ లగ్జరీ బస్సుల చార్జీలు భారీగా తగ్గించినట్లు, ఇవి ఈనెల 26 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లహరి బస్సులో సీటుకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్జి రూ.1,440 ఉండగా.. ప్రస్తుతం రూ.1,250కి, అలాగే స్లీపర్ చార్జి రూ.1,800 ఉండగా.. రూ.1,620కి, సూపర్ లగ్జరీకి రూ.1,080 నుంచి రూ.990కు తగ్గించినట్లు వివరించారు. ఈఅవకాశాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.