
బడి బస్.. ఫిట్‘లెస్’!
భక్తిశ్రద్ధలతో
బక్రీద్
బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాకేంద్రంతో పాటు నర్సంపేట, వర్ధన్నపేటతో పాటు తదితర ప్రాంతాల్లోని ఈద్గాల్లో శనివారం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఖిలా వరంగల్ పెట్రోల్‌బంక్ జంక్షన్‌లోని ఈద్గాలో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలకు ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రార్థన చేస్తున్న చిన్నారులు
‘పిల్లలున్నారు జాగ్రత్త’ అని బడి బస్సుల వెనకాల రాసి ఉంటుంది. కానీ.. చాలా బస్సుల నిర్వాహకులు మాత్రం.. ఆ విషయాన్నే మరిచిపోతున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా పాఠశాలల ప్రారంభానికి ముందే బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. కానీ.. క్షేత్రస్థాయిలో అవేమీ అమలు కావడం లేదనే విమర్శలున్నాయి.
– సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్
బడి గంట మోగే సమయం ఆసన్నమవుతోంది.. ఇప్పటికే అడ్మిషన్ల బిజీలో ఉన్న పాఠశాలలు బడి బస్సుల భద్రతపై దృష్టి సారించడం లేదు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఫిట్నెస్ పరీక్షలకు వందలాది బస్సులు దూరంగా ఉండడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,820 పాఠశాలల, కాలేజీల బస్సులు ఉన్నా.. ఇప్పటివరకు 863 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్లు పొందాయి. పదిహేనేళ్ల కాల పరిమితి పూర్తి చేసుకున్నా.. వివిధ కారణాల చేత 225 బస్సులను అధికారులు ఫిట్నెస్ చేయకుండా తిరస్కరించారు. ఇంకా మిగిలిన 692 బస్సులకు ఆన్లైన్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆయా బస్సులు వచ్చి సాధ్యమైనంత త్వరగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు కోరుతున్నారు. ఫిట్నెస్ పరీక్షల్లో పాసైతే విద్యార్థుల భద్రతకు భరోసా ఉంటుందని చెబుతున్నారు. ‘యాబై రోజులకుపైగా మూసి ఉన్న విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇన్నాళ్లూ విద్యార్థులను తరలించే బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి. వాటి సామర్థ్య పరీక్షల గడువు కూడా మే 15కే ముగిసింది. ఇప్పటికీ ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోని బడి బస్సులు వచ్చి త్వరగా చేసుకోవాలి’ అని వరంగల్ ఆర్టీఓ శోభన్‌బాబు కోరారు.
ఇలా చేస్తే మంచిది..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పరీక్షలను సంబంధిత అధికారులు తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు. కనీసం పది నిమిషాలైనా చెక్ చేయకుండానే బస్సులను పంపించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం అధికారులు అప్రమత్తమవుతున్నారని.. ప్రమాదాలు జరగకుండా ముందుగానే బస్సుల తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ‘పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి బస్సు ఫిట్నెస్ పకడ్బందీగా చూడాలి. చాలా పాఠశాలలకు ఎక్కువ సంఖ్యలో బస్సులుంటాయి. ఒకటి రెండు బస్సులను చూసే ఫిట్నెస్ అయ్యిందని మమ అనిపించకుండా ప్రతి బస్సును చెక్ చేయాలి. నెల, రెండు నెలలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బస్సుల పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి చెక్ చేస్తూ ఉండాలి. ఏవైనా లోపాలు ఉంటే ఒత్తిళ్లకు లొంగకుండా బస్సును సీజ్ చేయాలి’ అని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
– మరిన్ని ఫొటోలు 11లోu
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తికాని బడి బస్సుల పరీక్షలు
1,820కి ఇప్పటివరకు
పూర్తి చేసుకుంది 887
పరీక్షలు చేసుకోవాల్సింది 917..
ఫిట్నెస్ తనిఖీలకు రాని
వందల బస్సులు
ఈనెల 12న పాఠశాల
పునఃప్రారంభంతో చర్చ
స్పెషల్ డ్రైవ్‌లకు సిద్ధమవుతున్న
ఆర్టీఏ అధికారులు
ఇవీ నిబంధనలు..
15 ఏళ్లు నిండిన వాహనాలను స్టూడెంట్స్ రవాణాకు ఉపయోగించకూడదు. స్కూల్ బస్సు పూర్తి కండిషన్లో ఉండాలి.
విద్యా సంస్థ పేరు, సెల్‌ఫోన్ నంబరు, పూర్తి అడ్రస్ బస్సు ఎడమ వైపు, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి.
ప్రతీ విద్యాసంస్థ యాజమాన్యం డ్రైవర్ ఆరోగ్య పట్టిక నిర్వహించాలి.
డ్రైవర్ షుగర్, బీపీ, కంటిచూపు వంటి ప్రాథమిక పరీక్షలను ప్రతి 3 నెలలకోసారి చేయించాలి. డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం తప్పనిసరి.
బస్సులో ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఉండాలి. బస్సుకు సంబంధించి వైపర్స్, విండ్ స్క్రీన్, పార్కింగ్ లైట్స్, లైటింగ్ ఉండాలి.
ప్రతి బస్సులో మంటలు ఆర్పే పరికరాలు ఉండాలి. డ్రైవర్‌కు విద్యార్థులు బస్సు ఎక్కడం, దిగడం స్పష్టంగా కన్పించేలా అద్దాలు అమర్చుకోవాలి.
ప్రతి బస్సులో అటెండర్ ఉండాలి. బస్సులో ప్రయాణిస్తున్న స్టూడెంట్స్ పట్టిక కూడా ఉండాలి. బస్సులో స్టూడెంట్స్ బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి.
కిటికీలకు మధ్యలో లోహపు కడ్డీలు కచ్చితంగా ఉండాలి.
ఫుట్‌బోర్డ్‌పై మొదటి మెట్టు భూమికి 325 మిల్లీ మీటర్ల ఎత్తు మించకుండా చూడాలి. అన్ని మెట్లు జారకుండా లోహంతో నిర్మించాలి.
డైవర్లకు త్వరలోనే శిక్షణ
విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. రవాణాశాఖ నిబంధనల మేరకు ఫిట్నెస్ పరీక్షలు చేయిస్తున్నాం. వందశాతం ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యేలా చూస్తాం. ఐదేళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లను నియమిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలకు తావులేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నాం. పిల్లలను జాగ్రత్తగా పాఠశాలలకు తీసుకెళ్లి తీసుకొచ్చేందుకు డ్రైవర్లకు త్వరలోనే నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం.
– గాదె స్వరూప్‌రెడ్డి, ప్రైవేట్ విద్యాసంస్థల
బస్సుల ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
విస్త్తృత తనిఖీలు చేపడతాం..
విద్యాసంస్థల ప్రారంభంలోగా.. బస్సులన్నింటికీ సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలి. లేకుంటే విస్తృ త తనిఖీలు చేపట్టి పట్టుబడిన వాహనాలు సీజ్ చేస్తాం. జరిమానా విధిస్తాం. ఫిట్నెస్ పరీక్షలకు రాని బస్సులకు సంబంధించి యజమానులకు నోటీసులు పంపిస్తాం. అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించాలి. పిల్లల భద్రతపై శ్రద్ధ తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– పురుషోత్తం,
ఇన్చార్జ్ డీటీసీ, హనుమకొండ

బడి బస్.. ఫిట్‘లెస్’!

బడి బస్.. ఫిట్‘లెస్’!

బడి బస్.. ఫిట్‘లెస్’!

బడి బస్.. ఫిట్‘లెస్’!

బడి బస్.. ఫిట్‘లెస్’!

బడి బస్.. ఫిట్‘లెస్’!