
సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న నాయిని రాజేందర్‌రెడ్డి
డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, తెలంగాణ తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకుందామని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండలోని డీసీసీ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, సుబేదారిలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరులకు నివాళుర్పించిన అనంతరం నాయిని మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ కొందరి చేతిలో బందీ అయ్యిందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీకి గుణపాఠం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, డీసీసీ వరంగల్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, పులి అనిల్, బంక సరళ, బొమ్మతి విక్రమ్, కూర వెంకట్ తదితరులు పాల్గొన్నారు.