
వరంగల్ అర్బన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది వేడుకల్లో భాగంగా జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో గ్యాస్ బెలూన్లను ఎగురవేశారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో, హనుమకొండ కలెక్టరేట్, భద్రకాళీ బండ్, వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఆకాశంలోకి బెలూన్లను ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు.
ఎస్‌ఎస్‌ఆర్‌లో ఓటర్ల పూర్తి
సమాచారం సేకరించాలి
వరంగల్ తూర్పు ఈఆర్‌ఓ రిజ్వాన్ బాషా
వరంగల్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ సమ్మర్ రివిజన్–2023(ఎస్‌ఎస్‌ఆర్)లో ఓటర్ల పూర్తి సమాచారం సేకరించాలని వరంగల్ ఈఆర్‌ఓ, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. శుక్రవారం ఐఎంఎ హాల్‌లో వరంగల్, ఖిలావరంగల్ తహసీల్దార్లు సత్యపాల్‌రెడ్డి, ఫణికుమార్‌లతో కలిసి ఎస్‌ఎస్‌ఆర్–2023పై సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఓటర్ ఇంటికి వెళ్లి వారి సంక్షిప్త సమాచారం సేకరించాలన్నారు. ఈ కార్యక్రమం మే 21నుంచి జూన్ 23 వరకు జరుగుతుందని తెలిపారు. ఓటరు తన నమోదులో ఏమైనా సవరణలు ఉంటే సేకరించాలని తెలిపారు.

బీఎల్‌ఓను వివరాలడుగుతున్న రిజ్వాన్ బాషా