
శానిటేషన్ అధికారిని నిలదీస్తున్న బీజేపీ కౌన్సిలర్లు
పరకాల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయంపై సమయానికి జాతీయ జెండా ఆవిష్కరించకుండా కమిషనర్ టి.శేషాంజన్‌స్వామి అమరధామంలోని వేడుకలకు హాజరుకావడంపై బీజేపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. ఉదయం 8.30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత మిగతా చోట కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉంది. కాగా, కమిషనర్ మొదట ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎగురవేసే జెండా కార్యక్రమానికి హాజరై 9.30 గంటల వరకు కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోలేదు. ఆ తరువాత కమిషనర్ వచ్చి జెండావిష్కరించారు. అప్పటికీ వేచి చూస్తున్న బీజేపీ కౌన్సిలర్లు అసహనానికి గురయ్యారు. కార్యాలయంలో వేడుకల పట్ల కమిషనర్‌కు, ఉద్యోగులకు ఇంత నిర్లక్ష్యం ఎందుకంటూ శానిటేషన్ అధికారి వెంకట్‌రెడ్డిని నిలదీశారు. షెడ్యూల్ ప్రకారం జెండా ఎగురవేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కమిషనర్‌పై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు ఆర్‌పీ జయంత్‌లాల్, దేవునూరి రమ్యకృష్ణ, కొలనుపాక భద్రయ్య డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
జాతీయ జెండాకు అవమానమంటూ
అసహనం వ్యక్తం చేసిన బీజేపీ కౌన్సిలర్లు