
శనివారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2023
సీపీ కార్యాలయంలో
జెండావిష్కరణ
నయీంనగర్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీపీ ఏవీ రంగనాథ్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం చిన్నారులకు, సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు.
నేటి నుంచి
రేషన్ షాపులు బంద్
హన్మకొండ అర్బన్ : సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు చేపట్టిన నిరవధిక సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సంఘం జిల్లా నాయకుడు గౌరీశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రేషన్‌షాపులు బంద్ పాటిస్తామని పేర్కొన్నారు. చాలీచాలని కమీషన్లతో తమ బతుకులు అధ్వానంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోపు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి రేషన్ డీలర్ సమ్మెలో పాల్గొంటాడని, లబ్ధిదారులు సహకరించాలని కోరారు.
5 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
విద్యారణ్యపురి : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించిన విద్యార్థులకు ఈ నెల 5 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) గోపాల్ శుక్రవారం తెలిపారు. హనుమకొండ వడ్డ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తమ కళాశాలల్లో హాల్‌టికెట్లు తీసుకొని పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
నేటినుంచి ట్రాఫిక్ మళ్లింపు
రామన్నపేట : వరంగల్‌లోని (ఏడు మోరీలు) పోతన జంక్షన్–మేదరి వాడ రోడ్డు మరమ్మతులు జరుగుతున్నందున ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ట్రాపిక్ సీఐ బాబులాల్ తెలిపారు. శనివారం నుంచి ఈనెల 10 వరకు వాహనాలను మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండలోని అదాలత్ జంక్షన్, హంటర్ రోడ్డు, పోతన రోడ్డు మీదుగా వరంగల్ రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌కు వెళ్లే వారు ఎంజీఎం, పోచమ్మమైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామ జంక్షన్ మీదుగా వెళ్లాలని ఆయన తెలిపారు. అలాగే, వరంగల్ రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్ నుంచి అండర్ బ్రిడ్జి, హంటర్ రోడ్డు మీదుగా అదాలత్ జంక్షన్ వైపు వెళ్లే వారు వరంగల్ చౌరస్తా, పోచమ్మమైదాన్ మీదుగా హనుమకొండకు వెళ్లాలని సీఐ సూచించారు.
చెరువు పనుల పరిశీలన
నడికూడ: మండలంలోని రామకృష్ణపూర్ గ్రామంలో అమృత్ సరోవర్ కింద చేపట్టిన చెరువు పనులను శుక్రవారం ఎన్‌ఆర్‌ఈజీఎస్ డైరెక్టర్ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ పరిశీలించారు. చెరువులో జరిగిన పని, రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ కుమార్, ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, ఎంపీఓ సయ్యద్ అఫ్జల్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
5వ తేదీ వరకు
అభ్యంతరాల స్వీకరణ
కాళోజీ సెంటర్: డీహెచ్‌ఈడబ్ల్యూ కింద స్వీకరించిన దరఖాస్తులను స్రూటినీ చేసి అర్హులైన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో నోటీస్ బోర్టులో ఉంచినట్లు జిల్లా సంక్షేమాధికారి ఎం.సబిత తెలిపారు. అభ్యర్థులెవరైనా అభ్యంతరాలుంటే ఈనెల 5తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు కార్యాలయంలో సమర్పించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హన్మకొండ అర్బన్: స్వరాష్ట్రం, స్వపరిపాలనలో తెలంగాణలోని ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు వచ్చాయని, సబ్బండ వర్గాల్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తున్నాయని ప్రభుత్వ చీఫ్‌విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. స్వరాష్ట్రం కల సిద్ధించి తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుంచేందుకు 21రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో వినయ్‌భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట పతాకావిష్కరణ చేసి పరేడ్ వందనం స్వీకరించారు. అనంతరం తొమ్మిదేళ్ల కాలంలో వివిధ రంగాల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యమనేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించారన్నారు. తద్వారా దేశానికే రాష్ట్ర రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన, అభివృద్ధి వంటివి సమాజానికి కొత్త మార్గం చూపుతున్నాయన్నారు.
● హనుమకొండ జిల్లాలో 55రైతు వేదికలు ఏర్పాటు చేసుకున్నామని, 178రైతుబంధు సమితుల ద్వారా రైతులకు చేరువై వారికి అండగా ఉంటున్నామన్నారు.
● పౌరసరఫరాల శాఖ ద్వారా 2,28,216 మంది కార్డుదారులకు, 110 సంక్షేమ హాస్టళ్లకు 2014 నుంచి నేటివరకు సన్నబియ్యం అందజేస్తున్నామన్నారు.
● 669 ధాన్యం కేంద్రాల ద్వారా కొనుగోలు సాగుతోందన్నారు.
● రెండు మార్కెట్ కమిటీల పరిధిలో రూ.21 కోట్ల టన్నుల సామర్థ్యంగల గోదాములు నిర్మించామన్నారు.
● వివిధ పథకాల ద్వారా 10,930మంది లబ్ధిదారులకు రూ.42.44కోట్లు అందించామన్నారు. జిల్లాలో కార్మిక ఉద్యో గ మాసోత్సవాల పేరుతో విన్నూత్న కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. త్వరలో కార్మిక భవనం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
● మన ఊరు మనబడి, మనబస్తీ – మనబడి వంటి కార్యక్రమాలు చేపట్టామని, మొదటి దశలో 176స్కూళ్ల రూ.85కోట్ల అంచనాతో పనులు చేపట్టామని వివరించారు.
● జీఓ 58ద్వారా 714దరఖాస్తులు రాగా అర్హులుగా గుర్తించిన 394 మందికి పట్టాలు అందజేసినట్లు తెలిపారు.
● హరితహారంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 11.65 లక్షల మొక్కలు నాటామన్నారు.
● దళితబంధు ద్వారా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 4,180 మంది లబ్ధిదారులకు రూ.413.82 కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. కంటి వెలుగు ద్వారా ఈ ఏడాదిలో జరిగిన రెండవ విడత ద్వారా 4.28 లక్షల మందికి కంటి పరీక్ష నిర్వహించి 61వేల మందికి రీడింగ్ కళ్లద్దాలు, 28,477 మందికి ప్రిస్క్రైబ్డ్ కళ్లద్దాలను పంపిణీ చేసినట్లు వివరించారు.
● అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో 5 ఆరోగ్య మహిళా క్లినిక్‌లు ప్రారంభమయ్యాయని, ఇందులో ఇప్పటివరకు 6,850 మంది పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు.
● ముఖ్యమంత్రి హామీ పథకం ద్వారా రూ.93.96 కోట్లు, అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.251.23 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
● పారిశ్రామికంగా, గొర్రెల పంపిణీ పథకం, మత్య్సశాఖ, మెప్మా ద్వారా చేపట్టిన పనులను వివరించారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించి వారి త్యాగాలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాఽథ్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
ప్రజా జీవితాల్లో గుణాత్మక మార్పు
అభివృద్ధిలో మోడల్‌గా నిలిచాం
అన్ని రంగాల్లో ఫలాలు
మానవ సమాజానికి పాఠాలు నేర్పాం
తెలంగాణ అవతరణ వేడుకల్లో చీఫ్‌విప్
వినయ్‌భాస్కర్


