
జెండాను ఎగురవేస్తున్న స్వర్ణ
గీసుకొండ: నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో రాష్ట్రం తెచ్చుకున్నామని, ఇవన్నీ సీఎం కేసీఆర్ కుటుంబానికే చెందాయని, రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత అనుకుంటే వారి ఆశలు నెరవేరలేదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని కొనాయమాకుల క్రాస్ వద్ద ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, బీమగాని సౌజన్య, తుమ్మనపెల్లి శ్రీనివాస్, చాడ కొమురారెడ్డి, వజ్ర రాజు, నాగారపు స్వామి, కూసం రమేశ్, సాయిలి ప్రభాకర్, ఎ.కరుణాకర్, దూల వెంకన్న, దుపాకి సంతోశ్, పీసాల రాజేశ్వర్‌రావు, గోపాల్, భిక్షపతి ఉన్నారు.
ఘన స్వాగతం.. సన్మానం
పర్వతగిరి: తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ శుక్రవారం మండల కేంద్రానికి వచ్చారు. ఆమెను యువజన కాంగ్రెస్ నాయకులు సత్కరించి స్వాగతం పలికారు. కార్య క్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కందికట్ల అనిల్, కొమ్ము రమేశ్, ఎర్రబోయిన సాంబరాజు, మూడు దేవరాజ్, పిట్టల లోకేశ్, యాకుబ్, దేవరాజ్, మనీ, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ