
ఏర్పాట్లను పరిశీలించేందుకు వస్తున్న మంత్రి
రాయపర్తి: రైతుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. మండలంలోని మొరిపిరాలలో నిర్వహించనున్న రైతు దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శుక్రవారం మంత్రి పరిశీలించారు. అనంతరం మండలంలోని సన్నూరు గ్రామంలో నిర్వహిస్తున్న కుట్టుశిక్షణ కేంద్రాన్ని మంత్రి సందర్శించి పరిశీలించారు. మంత్రి వెంట ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్‌రావు, సర్పంచ్ చెడుపాక కుమారస్వామి, తాళ్లపెల్లి సంతోశ్‌గౌడ్, నాగపురి సోమన్న తదితరులు పాల్గొన్నారు.
రేపట్నుంచి ఎంసీపీఐ(యు) రాష్ట్ర ప్లీనరీ సభలు
హన్మకొండ: ఎంసీపీఐ (యు) రాష్ట్ర ప్లీనరీ సభలు నర్సంపేటలో ఈనెల 4, 5, 6 తేదీల్లో జరుగుతాయని ఆపార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్‌రెడ్డి హంసరెడ్డి తెలిపారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కులో ప్లీనరీ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎన్‌హంసరెడ్డి మాట్లాడుతూ.. నర్సంపేటలో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్లీనరీని పురస్కరించుకుని ఈ నెల 4న నర్సంపేటలోని బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ సెంటర్ నుంచి వరంగల్ రోడ్డు వరకు భారీ ఎరద్రండు ప్రదర్శన ద్వారా బహిరంగ సభకు చేరుకోనున్నట్లు వివరించారు. 5, 6 తేదీల్లో రెండు రోజులు ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. ఈ ప్లీనరీ సమావేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 400 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం నాగార్జున, మాస్ సావిత్రి, నాయకులు యాకమ్మ, హిందూ కళ్యాణి, రామ్మోహన్, రాధిక, మణిమాల, సరళ, ఖాజా పాషా, సరిత, రాణి, అశ్విని, అఖిల, నందిని, వైష్ణవి, స్వరూప తదిత రులు పాల్గొన్నారు.

వాల్ పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి హంసరెడ్డి, నాయకులు