
బడిబాటలో సంగెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీచర్లు (ఫైల్)
కాళోజీ సెంటర్: కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి బడీడు, బడి బయటి పిల్లలను గుర్తించనున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి పిల్ల లను ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్ చేసేలా కృషి చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు చేపడతారు. ఈకార్యక్రమం ఈనెల 9 వరకు కొనసాగుతుంది. తదుపరి షెడ్యూల్ ప్రకారం వివిధ కార్యక్రమాలను 17వ తేదీ వరకు కొనసాగిస్తారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 460, ప్రాథమికోన్నత పాఠశాలలు 65, హైస్కూళ్లు 125 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 50,735 మంది విద్యార్థులున్నారు. ఈసంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు.
కార్యక్రమాలివే..
● ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బడిబాట ఎన్‌రెల్‌మెంట్ డ్రైవ్.
● 12వ తేదీ నుంచి తరగతుల బోధన ప్రారంభం.
● 13న విద్యార్థుల తల్లిదండ్రులకు తొలిమెట్టు కార్యక్రమంపై అవగాహన.
● 14న సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం.
● 15న ప్రత్యేక అవసరాలు గల పిల్లలను బడిబయటి పిల్లలను ఎన్‌రోల్ చేయడం.
● 16న ఇంగ్లిష్ మీడియం పాఠశాలలపై అవగాహన.
● 17న బాలికల ఎడ్యుకేషన్ అండ్ కేరీర్ గైడెన్స్‌పై బాలికల తల్లిదండ్రులకు అవగాహన.
విద్యార్థుల సంఖ్య పెంచేలా..
బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. 3న బడిబాట ప్రారంభమవుతుంది.
– డి.వాసంతి, డీఈఓ, వరంగల్
బడీడు పిల్లల గుర్తింపు, ప్రవేశాలు
ఈనెల 12న పాఠశాలల పునఃప్రారంభం
